షర్మిల యాత్ర - రాహుల్ సమర్పణ
posted on Oct 12, 2012 6:10PM

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయ్యేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోందని రాష్ట్రంలో తలపండిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్నిచూస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైకాపాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలుగుదేశం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టడమే లక్ష్యంగా వ్యూహాలు సాగుతున్నాయనికూడా కొందరంటున్నారు. అంచనాల్ని తలక్రిందులు చేస్తూ తెలుగుదేశంపార్టీకి గతవైభవాన్ని కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నామీకోసం యాత్రకు జనంనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. టిడిపికి జనంలో పెరుగుతున్న ఆదరణనుచూసి కంగారుపడ్డ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీగా వై.ఎస్ జగన్ చెల్లెలు షర్మిలని రంగంలోకి దించుతోంది. ఇడుపులపాయనుంచి మొదలయ్యే షర్మిలయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యింది. అంతా బాగానే ఉంది కానీ ఈ యాత్రకు అసలు స్పాన్సరర్ ఎవరన్నదానిమీద ఇప్పుడు జనంలో ఉత్కంఠ బయలుదేరింది. రాహుల్ ప్రథాని కావాలంటే రాష్ట్రంనుంచి కనీసం పాతికమంది ఎంపీల మద్దతు తప్పదు. కాంగ్రెస్ నేతల్ని మాత్రమే నమ్ముకుని కూర్చుంటే ఓడలు బండ్లయ్యే ప్రమాదం ఉందన్న విషయం సోనియాకి స్పష్టంగా తెలుసు. ఈ పరిస్థితుల్లో అడ్డుపడి ఆదుకోగలిగిన సత్తా ఒక్క వై.ఎస్.ఆర్.సి.పికి మాత్రమే ఉందన్న విషయం సోనియాతోపాటు రాహుల్ కి కూడా స్పష్టంగా తెలుసు. రాష్ట్రపతి ఎన్నికల్లో వై.ఎస్ జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధికి ఓటేయడంకూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఎపిసోడ్ కి మంచి ఉదాహరణ అని చాలామంది చెవులు కొరుక్కున్నారుకూడా. ఈ పరిణామాలన్నింటినీబట్టి చూస్తే షర్మిలయాత్రకి రాహుల్ గాంధీ స్పాన్సర్ షిప్ వ్యవహారం నిజమే అయ్యుండచ్చని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారు.
.jpeg)